మంగళగిరిలో వామపక్షాల నిరసన

గుంటూరు జిల్లా మంగళగిరిలో సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. గౌతమ బుద్ధ రోడ్డులోని సీపీఐ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నాయకులు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా CEC జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓట్లను తొలగిస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఓటరు జాబితాలో జరుగుతున్న మార్పులపై స్పష్టత ఇవ్వాలని, తొలగించిన ఓట్లపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.





