నిడమర్రు స్కూల్ SMC ఎన్నిక.. ఏకగ్రీవం!

గుంటూరు జిల్లా. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నిడమర్రు లీప్ జడ్పీ హైస్కూల్లో SMC ఎన్నికలు జరిగాయి. చైర్మన్గా తోట పవన్కృష్ణ, వైస్ చైర్మన్గా గౌస్యా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానోపాధ్యాయురాలు దుర్గా భవానీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. 15 మంది తల్లిదండ్రులు SMC సభ్యులుగా ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కమిటీ కృషి చేయాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.



