కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

TG: ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మదీనాగూడలో ‘వన్ డే–వన్ వార్డ్’ కార్యక్రమం నిర్వహించారు. మైత్రినగర్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, కమిషనర్ సృజనతో పాటు అధికారులు పాల్గొన్నారు. మదీనాగూడ, హఫీజ్‌పేట్ ప్రాంతాల కాలనీవాసులతో నేతలు ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.




