పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన RDO

TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో SIR స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా హుజూరాబాద్ RDO జల కుమారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా BLOల పనితీరు, ఓటర్లకు అందుతున్న సేవలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించారు. SIR ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి. సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, గిర్ధావర్ సత్యనారాయణ, GPOలు శ్రావణ్, రాజ్ కిరణ్, హరీష్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.



