← Back to news

సచివాలయం దగ్గర స్వీపర్ల ఆవేదన

By Sharmila· 1d ago

TG: తెలంగాణ సచివాలయం లోని DCM భట్టి విక్రమార్క ఛాంబర్స్ దగ్గర పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. 20 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వారు ఆరోపించారు. గతంలో నెలకు 5,200 రూపాయలు జీతం వచ్చేదని ఓ మహిళా కార్మికురాలు తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేయిస్తున్నా జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ బకాయిలను వెంటనే చెల్లించాలని స్వీపర్లు కోరుతున్నారు.

More in TG