← Back to news

దొంగతనానికి వచ్చాడనుకొని..యువకుడి హత్య

By విశీ· 10 Aug 2026
దొంగతనానికి వచ్చాడనుకొని..యువకుడి హత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సాహిబాబాద్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఓ యువకుడు(17) హత్యకు గురయ్యాడు. అతను ఇనుప రాడ్లు దొంగిలించడానికి వచ్చాడని అనుమానించి సెక్యూరిటీ గార్డు అతణ్ని తుపాకీతో కాల్చాడు. అయితే అతను తన కొత్త మొబైల్‌తో రీల్ తీయడానికి వెళ్లాడని కుటుంబసభ్యులు అంటున్నారు. గార్డు వివేక్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.