మనవడి కోసం 400 KM పాదయాత్ర

AP: గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన ఆకుల కామేశ్వరి మనవడు ధనుష్(20) రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురై కాళ్లు, చేతులు చచ్చుబడిన పరిస్థితికి చేరుకున్నాడు. వైద్యులు కోలుకోవడం కష్టమని చెప్పడంతో వెంకన్నపై భారం వేసిన కామేశ్వరి, మనవడి ఆరోగ్యం మెరుగుపడితే గుంటూరు నుంచి తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకున్నారు. ఆరోగ్యంలో కొంత మార్పు రావడంతో జూన్ 11న పాదయాత్ర ప్రారంభించారు. 57రోజుల పాటు గోవింద నామస్మరణ చేస్తూ 400కిలో మీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.



