అన్నపూర్ణ రిజర్వాయర్‌కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్కు ఎంఎంఆర్ నుంచి 3,252 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు రిజర్వాయర్లో 1.598 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 389.39 మీటర్లుగా నమోదైంది. ప్యాకేజీ-11 ద్వారా 3,472, ఇతర అవసరాలకు 6 కలిపి మొత్తం 3,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.



