ఉదయగిరి PM SHRI స్కూల్‌లో SMC ఎన్నికలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి PM SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో SMC ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్‌గా మొగల్ ఖాజా జమీర్, వైస్ చైర్మన్‌గా SK. సాజిద ఎన్నిక కాగా, 13 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని సంబంధిత అధికారులు సూచించారు.



