← Back to news

భవనం గోడ కూలి ముగ్గురు పిల్లలకి గాయాలు

By RK· 17 Jul 2026· Uttar pradesh
భవనం గోడ కూలి ముగ్గురు పిల్లలకి గాయాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మకాన్‌పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కొందరు ఈ కూలిన భాగాల కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్ స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పిల్లలను బయటకు తీసి ట్రీట్మెంట్ కోసం దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు.

More in News