బాత్‌రూమ్‌లో ఎక్కువసేపు ఉంటే డోర్ ఆటో ఓపెన్!

న్యూయార్క్‌లో పబ్లిక్ బాత్‌రూమ్‌ల విషయంలో కొత్త రూల్స్ వచ్చాయి. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైటెక్ పబ్లిక్ బాత్‌రూమ్‌లు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని యూజ్ చేయడానికి 10 నిమిషాల టైమ్ లిమిట్ పెట్టారు. 5, 8 నిమిషాలకు అలర్ట్స్ వస్తాయి. 10 నిమిషాలు పూర్తయ్యాక డోర్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. బాత్‌రూమ్‌లో ఎక్కువసేపు కూర్చొని ఫోన్ స్క్రోల్ చేయకుండా ఉండేందుకే ఈ రూల్ పెట్టినట్లు మేయర్ జోహ్రాన్ మమ్దానీ తెలిపారు.


