హైదరాబాద్‌లో ముస్లింవాద సాహిత్య సదస్సు

ముస్లింవాద సాహిత్య సదస్సు సెప్టెంబర్ 19, 20న హైదరాబాద్.. కోఠి లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో జరుగుతుంది. తొలి సభ 19న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా ఖాదర్ మొహియుద్దీన్ హాజరవుతారు. సయ్యద్ ఖుర్రీద్ ఆహ్వానిస్తుండగా.. సైబాజి దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సదస్సులో ముస్లింవాద కవితలు, సంఘీభావ కవి సమ్మేళనం, పాటలు వినిపిస్తారు. దాక్టర్ నామోజు బాలాచారి, జాపాక సుభద్ర వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ముస్లిం సాహిత్యం, దేశభక్తి, సామాజిక అంశాలపై చర్చలకు వేదికగా నిలుస్తుంది.



