← Back to news

వేలాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

By DK· 4h ago
వేలాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో జైపూర్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, సోషల్ మీడియా భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డయల్-112 సేవలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనపై వివరించారు. గ్రామంలోని ఇళ్లను, వాహనాలను తనిఖీ చేయగా సరైన ధ్రువపత్రాలు లేని 62 బైకులు, 5 ఆటోలు, ఒక కారు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వినాయక చవితి ఉత్సవాలు, శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.

More in Politics