ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

TG : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో నైట్ డ్యూటీకి క్యాబ్ లో వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిని ఎవరూ లేని చోటికి తీసుకెళ్లి క్యాబ్ డ్రైవర్, ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె ధైర్యంతో అతడిపై ఎదురుతిరిగింది , ఎక్కడ దొరుకుతాననే భయంతో డ్రైవర్ తన కారుతో పారిపోయాడు. బాధితురాలు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్టు పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.



