ఒకే నెలలో రెండు అంతర్జాతీయ టైటిళ్లు..

18 ఏళ్ల సాయి నాచికేత్ భట్రాజు 'ఆల్-ఇంగ్లాండ్' జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచి, తొలి భారతీయుడిగా నిలిచాడు. హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ అకాడమీలో శిక్షణ తీసుకుని ఈ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత వెంటనే టర్కీ జూనియర్ ఇంటర్నేషనల్ టైటిల్ కూడా గెలుచుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.



