రోబో డ్యాన్స్‌తో షాప్ ఓపెనింగ్ వైరల్

మధ్యప్రదేశ్.. ఉజ్జయినిలో ఓ సాండ్‌విచ్ షాప్ ప్రారంభోత్సవానికి రోబోను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ రోబో విలువ 12 లక్షల రూపాయలు. షాప్ ప్రారంభ కార్యక్రమంలో రోబో.. అతిథులను స్వాగతించింది. రిబ్బన్ కటింగ్‌లో పాల్గొంది. తర్వాత డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. రోబోతో ఫొటోలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. సాధారణంగా ప్రముఖులను ఆహ్వానించే ప్రారంభోత్సవాలకు భిన్నంగా ఈ కార్యక్రమం జరిగింది. దీంతో ఈ ఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. కార్యక్రమ <a href="https://www.instagram.com/reels/Dcf9uIwvoee/">వీడియో</a> సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.



