← Back to news

భిక్ష విషయంలో ట్రాన్స్‌జెండర్ల మధ్య ఫైట్‌.. కేసు నమోదు

By Mahesh· 1d ago· Maharashtra

మహారాష్ట్రలోని పుణె జిల్లా ఆళందిలో ట్రాన్స్‌జెండర్ వర్గాల మధ్య గొడవ సీరియస్‌గా మారింది. ఇంద్రాయణి నది ఘాట్ వద్ద భక్తులను భిక్ష అడిగే విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన మాటల గొడవ.. కాసేపటికే ఫైట్‌గా మారింది. తనను దూషించడంతో పాటు ‘ఫైటర్‌’తో తలపై దాడి చేశారని 26 ఏళ్ల యోగేష్ గణమోటే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. చంపేస్తామని బెదిరించారని ఆరోపించాడు. దీంతో ఐదుగురితో పాటు మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime