← Back to news

ఆకలి వేస్తే కోపం ఎందుకు?

By Sharmila· 6h ago
ఆకలి వేస్తే కోపం ఎందుకు?

మనసులో ఆకలి పెరిగినప్పుడు మనిషి ప్రవర్తనలో మార్పులు వస్తాయని PLOS Oneలో ప్రచురితమైన Viren Swami స్టడీ తెలిపింది. ఆకలి సమయంలో రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం వల్ల చిరాకు, కోపం పెరగవచ్చు. దీనినే ‘హ్యాంగ్రీ’ అని అంటారు. ఆకలిగా ఉన్నప్పుడు శారీరక శక్తితో పాటు మానసిక ఏకాగ్రత కూడా తగ్గి, నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుందని ఈ స్టడీ తెలిపింది. అందుకే ఆకలిని ఎక్కువసేపు నిర్లక్ష్యం చేయకుండా సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది.

More in Health