← Back to news

Environmental Justice కోసం OUలో మ్యూజికల్ ఈవెంట్

By Vishi· 3h ago· హైదరాబాద్
Environmental Justice కోసం OUలో మ్యూజికల్ ఈవెంట్

TG: పర్యావరణ న్యాయం (Environmental Justice) అంశంపై అవగాహన కల్పించేందుకు ‘క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ’ ఆధ్వర్యంలో రేపు (12వ తేదీ) సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు‌. ప్రముఖ గాయని, సామాజిక కార్యకర్త విమలక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో రెలారె ప్రసాద్ (గాయకుడు), జై సూర్య & టీమ్ (రిథమ్స్ ఆఫ్ తెలంగాణ), సురేష్ బాబు & టీమ్ (నది కల్చరల్ సెంటర్) తదితరులు పాల్గొంటారు.

More in TG

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?
TG· 6h ago

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?

TG: గద్వాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రేపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రంగముని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తల్లిదండ్రులతో వెళ్లేది లేదని మహేశ్వరి పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కులాంతర వివాహంపై కోపంతో యువతి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లు, గడ్డపారలతో రంగముని ఇంటిని కూల్చేశారు. <a href="https://www.theclearcutnews.com/n/s7Lc8Cr">బాధితుల ఫిర్యాదుతో</a> పోలీసులు గ్రామంలో సెక్యూరిటీ పెట్టారు. ఘటన తర్వాత ఆ ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.