← Back to news

తాళి మహిళలే ఎందుకు వేసుకోవాలి?: నమిత

By Mahesh· 2h ago· Indiatimes
తాళి మహిళలే ఎందుకు వేసుకోవాలి?: నమిత

పెళ్లి సంప్రదాయాలు, మహిళలపై సొసైటి పెట్టే రూల్స్‌పై నటి నమిత కీలక కామెంట్స్ చేశారు. పురుషులకు లేని రూల్స్ మహిళలకే ఎందుకని ప్రశ్నించారు. ‘తాళి, బొట్టు, సంప్రదాయాలు మహిళలే పాటించాలని ఎందుకు ఆశిస్తారు?’ అని నిలదీశారు. భర్త క్షేమం కోసం మహిళలు ఉపవాసాలు ఉంటుంటే.. భార్య క్షేమం కోసం భర్తలు ఏడాదిలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలనే రూల్ ఎందుకు లేదన్నారు. మహిళలు తాళి వేసుకునే రూల్స్‌ ఏ గ్రంథాల్లోనూ లేవని, ఇవన్నీ సమాజం క్రియేట్ చేసినవేనని అన్నారు. నమిత చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

More in Entertainment