BJPని నిలదీసిన అభిజీత్ దీప్కే

కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లోని స్కూళ్లలోని లోపాలను వేలెత్తి చూపితే అక్కడి విద్యాశాఖ మంత్రులు స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తెలిపారు. అయితే BJP పాలిత రాష్ట్రాల్లోని పాఠశాలల దారుణ పరిస్థితులను బయటపెడితే మాత్రం తమ టీమ్‌పైకి గూండాలను పంపుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు BJP బాధ్యతాయుతమైన సమాధానానికి ఎందుకు భయపడుతోంది? విద్యావ్యవస్థకు BJP ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు.


