← Back to news

విషాదం.. ప్రసవం తర్వాత తల్లి, శిశువు మృతి

By Kamal Kumar· 11h ago· Tandur, Tandur, Vikarabad
విషాదం.. ప్రసవం తర్వాత తల్లి, శిశువు మృతి

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రిలో విషాదం. జినుగుర్తి గ్రామానికి చెందిన బాలమణి మొదటి కాన్పు కోసం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. ప్రసవం అనంతరం తల్లి, పుట్టిన పాప ఇద్దరూ మృతి చెందారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు, పాప ప్రాణాలు కోల్పోయారని మృతురాలి తండ్రి వడ్డే బాలప్ప ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెల్లడించాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More in Local