← Back to news

మహబూబాబాద్‌ పట్టణంలో రోడ్డు యాక్సిడెంట్

By అనిల్ బాబు· 19h ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తోర్రూరు–మహబూబాబాద్ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలబడి ఉన్న మహిళ, 7 ఏళ్ల బాలుడిని Royal Enfield బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళతో పాటు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి తల, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం కాగా స్పృహ కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అంబులెన్స్ ఆలస్యం కావడంతో బాలుడిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More in Local