← Back to news

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?

By Balakrishna· 20 Jul 2026
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?

దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా దూరం కానుందా? చిన్నతనంలోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, ఆన్‌లైన్ నేరాల బారిన పడటం వంటి దుష్ప్రభావాలను లోనవుతున్నారు. దీన్ని అరికట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో అమలు చేస్తున్న ఏజ్ లిమిట్ రూల్‌ను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం కింద తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.

More in News