నవోదయ ప్రవేశాలకు అక్టోబర్ 15 వరకు ఛాన్స్

నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును అక్టోబర్ 15వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ రాంబాబు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతికి <a href="https://cbseitms.nic.in/2026/nvsix_9/">cbseitms.nic.in/2026/nvsix_9/</a> వెబ్‌సైట్ ద్వారా, 11వ తరగతి ప్రవేశానికి <a href="https://cbseitms.nic.in/2026/nvsxi_11/?AspxAutoDetectCookieSupport=1">cbseitms.nic.in/2026/nvsxi_11/</a> వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.



