మసీదులపై చర్యలు.. జంతర్ మంతర్‌లో నిరసన
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మసీదులపై జరుగుతున్న చర్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో ముస్లిం సంస్థలు పాల్గొన్నాయి. జమియత్ ఉలమా-ఎ-హింద్ సంస్థ ఈ నిరసనకు సపోర్ట్ చేసింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ఇక్రా హసన్, జియాఉర్ రెహమాన్ బర్క్, మొహిబ్బుల్లా నద్వి ఈ నిరసనలో పాల్గొన్నారు. మసీదులు కూల్చడం, బుల్డోజర్ చర్యలు, ఓటరు జాబితాల్లో పేర్లు తొలగించడం లాంటి అంశాలపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు.



