← Back to news

సల్మాన్ కు ధురంధర్ చెక్

6 Apr 2026· Telugu Report· Hyderabad
సల్మాన్ కు ధురంధర్ చెక్

సినీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన Koimoi Star Rankingsలో గత ఏడేళ్లుగా రారాజులా వెలిగిపోతున్న సల్మాన్ ఖాన్ కు రణవీర్ సింగ్ చెక్ పెట్టారు. ధురంధర్ 2తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రణవీర్ సింగ్ ఈ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. బాక్సాఫీస్ వద్ద హీరోల స్టామినాను కొలవడానికి ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. ధురంధర్ 2 వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరడంతో రణవీర్ సింగ్ ఒక్కసారిగా రేసులో దూసుకుపోయారు. 2900 పాయింట్లతో ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సల్మాన్ ఖాన్ 2850 పాయింట్లతో రెండో ప్లేస్ లో ఉన్నారు. షారూక్ ఖాన్ మూడో ప్లేస్ కు పరిమితమయ్యారు.

More in Entertainment