← Back to news

మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

By garutoti Surendra· 1d ago· Nellore 2 (U), Nellore Urban, Sri Potti Sriramulu Nellore
మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

నెల్లూరు నగరంలోని జనార్దన్ రెడ్డి కాలనీ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇళ్లకు, ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని, పాత 53, 54 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కుళాయిల ద్వారా వస్తున్న కలుషిత నీటిని అరికట్టి, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని కోరారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

More in Local