గ్యాస్ కోసం గిరిజన మహిళల అవస్థలు

AP: అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని గిరిజన గ్రామాల మహిళలు గ్యాస్ సిలిండర్ల కోసం పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. చీమలపాడు పంచాయతీ పరిధిలోని జెడ్. జోగంపేటలో గ్యాస్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 10కి పైగా గ్రామాల మహిళలు కోరారు. ప్రస్తుతం సిలిండర్ల కోసం సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని చీమలపాడు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు బంధాలు, కడగడ్డ, అజయ్‌పురం, జెడ్. జోగంపేట, గంగంపేట, నేరేడు బంధం తదితర గ్రామాల్లో 174 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు.



