← Back to news

యువత కోసం గ్రౌండ్.. సర్పంచుల కీలక నిర్ణయం

By rajinikanth nagilla· 2h ago· Bheemadevarpalle, Bheemadevarpalli, Hanumakonda
యువత కోసం గ్రౌండ్.. సర్పంచుల కీలక నిర్ణయం

TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ, చంటయ్యపల్లి గ్రామాల పోలీస్ ఉద్యోగార్థులకు సర్పంచులు అండగా నిలిచారు. కొత్తకొండ సర్పంచ్ సిద్ధమల్ల రమా రమేష్, చంటయ్యపల్లి సర్పంచ్ భూక్య సునీత మణికంఠ గ్రామీణ యువతకు ఫిజికల్‌ శిక్షణ అందించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ప్రత్యేకంగా గ్రౌండ్ ఏర్పాటుచేసి పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు శిక్షణకు అనుకూల వాతావరణం కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ యువత పోలీస్‌ ఉద్యోగాల్లో రాణించేందుకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

More in Local