లైబ్రరీ ఫండ్స్ బకాయిలు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ గ్రంథాలయాల అభివృద్ధి కోసం విడుదల చేయాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నుతో పాటు 8శాతం 'లైబ్రరీ సెస్'ను కూడా వసూలు చేస్తాయి. అయితే, ఈ విధంగా వసూలైన నిధులను మున్సిపాలిటీలు, పంచాయతీలు గ్రంథాలయ సంస్థలకు బదిలీ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 213 కోట్లు, తెలంగాణలో రూ. 302.49 కోట్ల మేర లైబ్రరీ సెస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.



