← Back to news

నాగచైతన్య ‘వృషకర్మ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

By Krishna· 18h ago
నాగచైతన్య ‘వృషకర్మ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నాగచైతన్య ప్రధాన పాత్రలో కార్తీక్‌ దండు డైరక్షన్ లో రూపొందుతున్న చిత్రం ‘వృషకర్మ’. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి మరో ప్రధాన పాత్ర. స్పర్ష్‌ శ్రీవాస్తవ, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాను డిసెంబర్‌ 4న రిలీజ్ చేస్తున్నామని చిత్ర బృందం గురువారం చెప్పింది. పురాణాంశాలతో మిళితమైన ఈ మిస్టిక్‌ హారర్‌ థ్రిల్లర్‌లో చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

More in Entertainment