← Back to news

టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

By DK· 11h ago
టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

TG: రాష్ట్రవ్యాప్తంగా టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీ-సేవా ఆన్‌లైన్ స్కిల్ సెంటర్ హైదరాబాద్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా, మున్సిపాలిటీ, పంచాయతీ, మండల కేంద్రాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. కొత్త పాన్ కార్డుల దరఖాస్తులు, సవరణలు, బస్సు, రైలు, విమాన టికెట్ల బుకింగ్, బ్యాంకు నగదు బదిలీలు, ఆధార్ ఆధారిత సేవలు, మైక్రో ఏటీఎం, క్యాష్ డిపాజిట్ బిల్లుల చెల్లింపులు వంటి సేవల ద్వారా ఉపాధి పొందవచ్చన్నారు.

More in TG