← Back to news

ఊహాశక్తిని అడ్డుకోవడమే సెన్సార్‌షిప్‌

By A. Ajay· 1h ago
ఊహాశక్తిని అడ్డుకోవడమే సెన్సార్‌షిప్‌

'నిషేధిత పుస్తకాల లైబ్రరీ' పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సీనియర్ జర్నలిస్టుకె.శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తకాల ప్రాధాన్యతను వివరించారు. సోవియట్‌ యూనియన్‌ సమాజం, అక్కడి ఆంక్షలు, ప్రచార ప్రభావాన్ని నవల ఆసక్తికరంగా చూపిస్తుందని తెలిపారు. రాజ్యం ప్రజలు ఎలా ఉండాలో చెప్పడం, వారి ఆలోచనలను నియంత్రించడం వంటి అంశాలను ఇందులో చూపించారన్నారు. సెన్సార్‌షిప్‌ ద్వారా ఊహాశక్తిని అడ్డుకునే ప్రయత్నాలను కూడా నవల వివరిస్తుందని చెప్పారు. పాఠకులు, పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ మంచి నవలను అందరూ చదవాలని సూచించారు.

More in Current Affairs

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్
Current Affairs· 6h ago

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.