← Back to news

నిరపరాధులను శిక్షిస్తున్నారు: ప్రకాశ్ రాజ్

By Lokesh· 1h ago· Hyderabad
నిరపరాధులను శిక్షిస్తున్నారు: ప్రకాశ్ రాజ్

ఛాయ ప్రచురణలో జరిగిన పుస్తక విడుదల కార్యక్రమానికి నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిని శిక్షించాలి కానీ, సిస్టమ్‌ను వాడుకుని ఉమర్ ఖలీద్, ప్రశ్న రావణ్ వంటి నిరపరాధులను కూడా టార్గెట్ చేస్తున్నారని కామెంట్ చేశారు. SIR పేరుతో దేశంలో రక్తం చిందని ‘మరణహోమం’ జరుగుతోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు మనుషుల కోసం కాకుండా ఎకానమీ కోసం జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.

More in Current Affairs

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్
Current Affairs· 6h ago

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.