రైల్వే టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

రైల్వేశాఖలో 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 29 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1(సిగ్నల్)లో 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3లో 6,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెన్త్ , ఐటీఐ, యాక్ట్ అప్రెంటిస్‌షిప్, బీఎస్సీ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ చెకప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/



