← Back to news

మస్కట్‌లో మహిళ.. KTR భరోసా!

By Mahesh· 1d ago· TG
మస్కట్‌లో మహిళ.. KTR భరోసా!

TG: కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి ఇంటి పనికోసం మస్కట్ వెళ్లారు. 6 నెలలు పని చేయించుకొని జీతం ఇవ్వకుండా వేధించారని, ఇండియాకు రావాలని కోరిన తర్వాత ఫోన్ లాక్కొని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆమె కొడుకు రాజు ఆరోపించారు. ఈ విషయాన్ని X ద్వారా KTR దృష్టికి తీసుకెళ్లిన రాజు, తెలంగాణ భవన్‌లో ఆయన్ను కలిసి సమస్య వివరించారు. KTR.. ఒమన్ NRI సెల్‌తో మాట్లాడి లక్ష్మిని ఇండియాకు తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆమెను తిరిగి రప్పించే బాధ్యత తీసుకుంటానని రాజుకు KTR భరోసా ఇచ్చారు.

More in TG