← Back to news

దీదీ ఓటమికి శపథం పడుతూ ఓ డాక్టర్ పాత వీడియో వైరల్

By DS· 11 May 2026· bengal

అపర కాళికలా నర్తిస్తున్న ఈవిడెవరో సాదా సాదా ఆర్టిస్టు కాదు.. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న డాక్టర్. ఆమె అలా కాళికలా నర్తించడానికి కారణం మాజీ సీఎం మమతా బెనర్జీ పాలనపై ఆగ్రహం.. అది కేవలం ఆగ్రహం మాత్రమే కాదు. శపథం. మమత పవర్ లోంచి దిగిపోయే వరకూ ఆమె అలాగే తన కోపాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ రీజన్ ఏంటో తెలుసా? కోల్ కాతాలోని ఆర్ జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను దీదీ ప్రభుత్వం సేవ్ చేస్తోందన్న కోపంతో ఆమె ఈ పని చేశారు. మమత ప్రభుత్వం దించుతామని శపథం చేస్తూ సాగిన ఈ డాన్స్ ఒక స్ట్రీట్ ప్లేలా గట్టిగానే పనిచేసింది.

More in Politics