సైక్లింగ్ గ్రూప్ ఫ్రెండ్స్ సాధించిన 10 ఏళ్ల మైలురాయి!🚴♂️

2016 ఇంగ్లాండ్‌లో స్నేహితులంతా కలిసి చిన్నగా ప్రారంభించిన సైక్లింగ్ ప్రయాణం నేడు పదేళ్లు పూర్తి చేసుకుంది. మొదట్లో కేవలం 11 మైళ్ల దూరంతో సరదాగా మొదలైన వీరి ప్రయాణం, ఆ తర్వాత 'బాంబే బైసికిల్ క్లబ్'గా మారింది. భారత జాతీయ జెండా రంగులతో కూడిన ప్రత్యేక జెర్సీలు ధరించి వీరు సైక్లింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల చనిపోయిన తమ తోటి మిత్రుడు క్రిస్ లెవిస్ జ్ఞాపకార్థం, పదేళ్ల మైలురాయి సందర్భంగా వీరంతా కలిసి మళ్లీ లివర్‌పూల్ సైకిల్ రైడ్‌లో పాల్గొని వాళ్ల బాండింగ్‌ని చూపెట్టారు.



