← Back to news

ఆర్టీసీ విలీనం కాంగ్రెస్‌తోనే సాధ్యం!

By Somireddy Adavalli· 11h ago· Quthbullapur, Pudur, Vikarabad
ఆర్టీసీ విలీనం కాంగ్రెస్‌తోనే సాధ్యం!

సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ఎన్నికల నేపథ్యంలో TJMU రాష్ట్ర కార్యదర్శి అభ్యర్థి హనుమంతుకు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన సభలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. సభలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.

More in Local