పాడేరులో ప్రజా సమావేశాలకు స్థలం ఫిక్స్!

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రజా సమావేశాలు, ప్రదర్శనలకు వీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఖాళీ స్థలాన్ని తాత్కాలిక నిర్దేశిత ప్రదేశంగా కలెక్టర్ నిశాంతి టి. గుర్తించారు. పోలీసుల అనుమతితో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, శాంతిభద్రతలకు భంగం కలగకుండా నిబంధనలు పాటించాలని కోరారు.



