← Back to news

తాళం వేసిన గది బయట వ్యాక్సిన్ బాక్సులు

By Md Jabeer· 3h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
తాళం వేసిన గది బయట వ్యాక్సిన్ బాక్సులు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలోని 30 పడకల ఆసుపత్రిలో వ్యాక్సిన్ల నిర్వహణపై నిర్లక్ష్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాళం వేసి ఉన్న గది వెలుపల విలువైన వ్యాక్సిన్ బాక్సులను సిబ్బంది అలాగే వదిలేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిబంధనల ప్రకారం Cold Chain పద్ధతిలో నిర్దిష్ట ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సిన వ్యాక్సిన్లు బయట ఉండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని రోగులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Local