← Back to news

మిస్సింగ్ కేస్‌లో షాకింగ్ ట్విస్ట్?

By sahani· 10 Aug 2026· AP
మిస్సింగ్ కేస్‌లో షాకింగ్ ట్విస్ట్?

AP: కృష్ణా జిల్లా పెడనలో ఇద్దరు మైనర్ గర్ల్స్ మిస్సింగ్ కేస్ సంచలనంగా మారింది. ఈ కేసులో శ్యామ్ కిరణ్, సిద్ధు అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 6న కనిపించకుండాపోయిన బాలికలు మరుసటి రోజు ఇంటికి రాగా, వాళ్లపై రేప్ జరిగిందని తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు SP విద్యాసాగర్ నాయుడు చెప్పారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.