స్వేరోస్ జిల్లా అధ్యక్షుడిగా కోడూరు స్వామి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ నియామకాల ఇన్‌ఛార్జి ఉప్పులేటి బాబు తెలిపారు. అధ్యక్షుడిగా కోడూరు స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల ప్రవీణ్, ఉపాధ్యక్షుడిగా చుంచు సుధాకర్, కోశాధికారిగా బాలస్వామిగా రామగళ్ల స్వామి ఎన్నికయ్యారు. నూతన కమిటీ విద్య, ఆరోగ్యం, పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.



