వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈనెల 24న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదించింది. ఇవాళ మూజువాణి ఓటుతో లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఎవరైనా పాడుతున్న టైంలో ఆటంకం కలిగించినా చట్టప్రకారం నేరంగా పరిగణిస్తారు.


