తొర్రూరులో పోస్టల్ ఉద్యోగిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విషాదం. చినపెల్లి అంకిత అనే యువతి ఉరి వేసుకుని మృతి చెందింది. ఆమె కొడకండ్ల పోస్టాఫీసులో పోస్టల్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. మృతదేహాన్ని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.



