← Back to news

సెస్‌ అధికారిపై వేటు.. సస్పెన్షన్‌ ఉత్తర్వులు

By Srikanth Goud· 2h ago· Rajannapet, Yellareddipet, Rajanna Sircilla
సెస్‌ అధికారిపై వేటు.. సస్పెన్షన్‌ ఉత్తర్వులు

రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్‌ సర్కిల్‌ కార్యాలయ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి కె. రవిని సస్పెండ్‌ చేస్తూ MD తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అనుచితంగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి సస్పెన్షన్‌ అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు నిబంధనల ప్రకారం జీవనభృతి చెల్లిస్తామని తెలిపారు.

More in Local