← Back to news

నా కొడుకు టెర్రరిస్ట్ కాదు: హీరో యశ్ తల్లి

By Vishi· 5d ago

కన్నడ హీరో యశ్ తల్లి పుష్ప అరుణ్‌కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. “నా కొడుకు టెర్రరిస్ట్ కాదు. అతను కర్ణాటకలోనే పుట్టి పెరిగాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, సొంతంగా ఈ స్థాయికి చేరుకున్నాడు. అతని ఎదుగుదలకు మీరెందుకు భయపడుతున్నారు?” అని అన్నారు. “KGFకి ముందే అతను అనేక హిట్ సినిమాలు ఇచ్చాడు. కన్నడలో సక్సెస్‌ఫుల్ స్టార్. ఎవరూ ఇవ్వని అవకాశాలు తన కష్టంతో సాధించుకున్నాడు” అని చెప్పారు. ‘KGFకి ముందు యశ్ ఎవరో తెలుసా’ అని గతంలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌కు ఆమె పరోక్షంగా ఆన్సర్ చేశారని చర్చ సాగుతోంది.

More in Entertainment