← Back to news

కృష్ణ బృందావన్ కాలనీలో ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్ జయకేతనం

By Shankar Soudarpally· 1h ago
కృష్ణ బృందావన్ కాలనీలో ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్ జయకేతనం

TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ బృందావన్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 307 ఓట్లు పోలవగా, ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్‌కు 180 ఓట్లు లభించాయి. ప్రత్యర్థి ప్యానెల్‌పై 53 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ప్రవీణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఉదయ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శరత్, కోశాధికారిగా త్రినాథ్‌బాబు, జాయింట్ సెక్రటరీగా యోగేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రేవంత్ ఎన్నికయ్యారు.

More in Local