← Back to news

పటాన్‌చెరు సమస్యలపై కేసీఆర్‌కు ఎమ్మెల్యే వివరణ

By Shankar Soudarpally· 1h ago
పటాన్‌చెరు సమస్యలపై కేసీఆర్‌కు ఎమ్మెల్యే వివరణ

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (జీఎంఆర్) బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం ఎర్రవల్లిలో జరిగిన బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం కేసీఆర్‌తో నియోజకవర్గ అభివృద్ధి, 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పటాన్‌చెరును అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని జీఎంఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు మందగించాయని వివరించారు.

More in Local